తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ

Updated: September 22, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలమేరకు టీటీడీ బోర్డు పాలకమండలి లో ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలను నేడు, బుధవారం హైకోర్టు సస్పెండ్ చేయడం పట్ల వైసిపి రెబల్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హర్షం వ్యక్తం చేసారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఈ  కేసుల వెనుక ఎటువంటి కుట్రలు లేవని, భక్తుల మనోభావాలను కాపాడడం కోసమే కేసు వేశారన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కి తగిన నిధులు లేవని, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో ఎవరిని నియమించకుండా వ్యాపారాలు చేసుకునే వారిని నియమిస్తున్నారని విమర్శించారు. భగవంతుడి సేవలో మంచివారిని నియమించాలన్నారు. టీటీడీ జాయింట్ ఈవో పోస్ట్ రాజ్యాంగ ప్రకారం ఉందని, కానీ.. అదనపు ఈవో పోస్టు లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ విధంగా టీటీడీ అదనపు ఈవోను నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీలో  ఏ అపచారం జరిగిన స్వదేశీ సేన తరపున ధర్మ పరిరక్షణ కొరకు పోరాటం చేస్తామని రఘురామకృష్ణం రాజు ప్రకటించారు. 

 
 

Related Stories