తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో

Updated: September 22, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం లో పుట్టి  తెలుగునాట బహుముఖ ప్రజ్ఞాశీలి, అద్భుత చిత్రకారుడు , స్వాతంత్ర్య సమరయోధుడు,లాయర్, కవి, నవల రచయిత, కళాకారుడు, నాటక కర్త అడవి బాపిరాజు 69వ వర్ధంతి కార్యక్రమాన్ని  స్థానిక కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్, రచయిత, తెలుగు పండితులు కలిగొట్ల గోపాలశర్మ మాట్లాడుతూ చిన్నతనం నుంచే బాపిరాజు సాహిత్యంపై ఆసక్తి చూపేవారని, భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారని, 1939 లో సినీ రంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశారనిట్ అన్నారు. అప్పటి నుండి  ఇప్పటికిప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట బాపిరాజు రాసిందే..  సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. ఒక మనిషిలో ఇన్ని ప్రతిభావంతమైన గుణాలు, కళలు ఉండటం అరుదు. ఈ కార్యక్రమం లో చెరుకువాడ రంగసాయి, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్, చాన్ భాషా, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, రచయిత జ్యోతిరావు  కొండ్రు శ్రీనివాస్, చెరుకువాడ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.

 
 

Related Stories