తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్

Updated: September 22, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఇటీవల సినీ నటుడు సోను సూద్ ఇంటిపై ఐటీ దాడులు జరిగి అయన ఇరవై కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డానన్న ఆరోపణలఫై ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను సూద్ ఘాటుగా స్వాదించారు. .. తన ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని సోనూ సూద్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కాస్త భిన్నంగా ఆలోచించి సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు అని అన్నారు. తన ఫౌండేషన్‌కు విరాళాల రూపంలో వచ్చిన డబ్బులోంచి పైసా కూడా వృధా చేయలేదని స్పష్టం చేశారు. తాను వెచ్చించిన మొత్తంలో విరాళాల కన్నా, తన సినిమాల రెమ్యూనరేషనే ఎక్కువని పేర్కొన్నారు. ‘దేశ్‌ కీ మెంటార్‌’ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు.  ప్రజల ముఖాల్లో ఆనందాలను నింపేందుకు తనను ఎవరైనా పిలిస్తే అది ఏ రాజకీయ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వమా,? గుజరాత్‌ ప్రభుత్వమా? బిహార్‌ ప్రభుత్వమా అని చూడకుండా వెళ్తానని స్పష్టంచేశారు. రూ.18.94 కోట్ల విరాళాలల్లో రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయనే దానికీ బదులిచ్చారు. ఈ డబ్బు ఖర్చు పెట్టేందుకు 18 నిమిషాలు చాలన్నారు. అయితే ప్రతి సమస్య వాస్తవమైనదేనా? అన్న కోణంలో తమ బృం దం పరిశీలిస్తుందని, క్షేత్రస్థాయి వర్గాలను ఆరా తీస్తుందని,  సాయానికి వెచ్చించిన విరాళాల్లో ఏమీ వృధా కాలేదని జనాలు నమ్ముతారని పేర్కొన్నారు.తాను విదేశాల నుంచి పైసా కూడా విరాళంగా తీసుకోలేదన్నారు. . 

 
 

Related Stories