తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు

Updated: September 21, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  దేశం అంటే మట్టి కాదు..  మనుష్యులోయి.. అన్న సుప్రసిద్ధ తెలుగు కవి ..గురజాడ అప్పారావు  159 వ జయంతి సభలను భీమవరం లో నేడు, మంగళవారం ఉదయం  చినరంగనిపాలెం లోని పస్తుల సాగరం మున్సిపల్ ఉన్నత పాఠశాల, లూధరన్ ఉన్నత పాఠశాలలలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం నిర్వహించింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ..దేశాభివృద్ధి జరగాలంటే ఏమి చేయాలో, దేశం ప్రజలు ఎలా ఉండాలో గురజాడ ఆనాడే స్పష్టమైన సందేశం  ఇచ్చారన్నారు. గురజాడ అభ్యుదయ కవి అని ,నవయుగ వైతాళికులని, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఆనాడు కన్యా శుల్కం నాటకం రచించరన్నారు. 110 సంవత్సరాల క్రితం  అభివృద్ధి,ప్రగతి, దేశభక్తి కోసం ఆయన చేసిన రచన 'దేశం ను ప్రేమించుమన్నా ' గేయం  ఎంతో  మంది దేశప్రజల హ్రృదయాలలో చిరస్థాయిగా నిలిచిందన్నారు..ముందుగా గురజాడ చిత్రపటం నకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు కె,వెంకటరావు, మణిరాజు, ఉపాధ్యాయులు  కె, శ్యామల రావు, బి,వి, గోపినాథ్,డి, శ్రీధర్, వి,ఐ ,కాంచన,సుమ, తదితరులు పాల్గొన్నారు

 
 

Related Stories