తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి

Updated: September 21, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు.. సభ్యులు చేతులు ఎత్తే విధానంలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నీలం సాహ్ని  అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలకు లేఖ రాశారు. మండల, జిల్లా పరిషత్‌ల వారీగా ఆ రోజు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ఉపాధ్యక్షులు, వైస్‌ చైర్మన్లు, కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధానాన్ని ఎస్‌ఈసీ ఆ లేఖలో వివరించారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులలో సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కోఆప్టెడెడ్‌ సభ్యుల  ఎన్నిక నిర్వహించాలి. వారు బలపరుస్తున్న అభ్యర్థికి  సభ్యులు చేతులు పైకి  ఎత్తి మద్దతు బలం ప్రకటించవచ్చు.  అదే విధంగా.. జిల్లా పరిధిలో ఎన్నికైన జెడ్పీటీసీలలో సగం మంది హాజరైతే జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్‌ చైర్మన్లు, ఇద్దరు కోఆప్టెడెడ్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించాలన్నారు.ఈ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకే ఓటు హక్కు ఉంటుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టంచేసింది. అయితే, ఎన్నిక జరుగుతున్న సమయంలో వారు ఎక్స్‌ అఫీషియో సభ్యుని హోదాలో ఆ సమావేశాల్లో పాల్గొనవచ్చని ప్రకటించారు. 

 
 

Related Stories