తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు

Updated: September 21, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న మోదీ, జోబైడెన్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఇందులో బైడెన్, మోదీ, జపాన్‌ ప్రధాని సుగా, స్కాట్‌మారిసన్‌ పాల్గొంటారు.  ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంపై నేతలు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. బైడెన్‌ అధ్యక్షుడయ్యాక మోదీతో జరిగే తొలి భేటీ ఇదే కావడం విశేషం.  భారత్ సరిహద్దు దేశం  ఆప్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినాక వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు యూఎస్‌ ప్రెసిడెంట్‌ కార్యక్రమాల షెడ్యూల్‌లో మోదీతో సమావేశాన్ని ఖరారు చేశారు. 2019లో చివరిసారి మోదీ అమెరికాలో పర్యటించారు.   కరోనా అనంతరం మోదీ జరపబోయే రెండో విదేశీ పర్యటన ఇదే! మార్చిలో ఆయన బంగ్లాదేశ్‌ను సందర్శించారు. మోదీతో సమావేశానంతరం జపాన్‌ ప్రధాని సుగాతో బైడెన్‌ భేటీ అవుతారని అధికారులు చెప్పారు.
 
 
 

Related Stories